ఇళ్లు కడితే టీఆర్ఎస్ కార్పొరేటర్లు పిల్లర్ కు 50వేలు వసూలు చేస్తున్నారు

ఇళ్లు కడితే టీఆర్ఎస్ కార్పొరేటర్లు పిల్లర్ కు 50వేలు వసూలు చేస్తున్నారు

వందేళ్లలో జరగని కబ్జాలు ఆరేళ్లలో జరిగాయి

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైనా ఇళ్లు కట్టుకుంటే టీఆర్ఎస్ కార్పొరేటర్లు పిల్లర్ కు 50 వేలు చొప్పున లంచం వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం అండతో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని.. వందేళ్లలో జరగని కబ్జాలు ఈ ఒక్క ఆరేళ్లలో జరిగాయని ఆయన పేర్కొన్నారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా రెండు మతాల మధ్య చిచ్చు లేపి ఓట్లు సంపాదించాలని చూస్తున్నారని విమర్శించారు. 67వేల కోట్ల నిధులతో హైదరాబాద్ ను  అభివృద్ధి చేశామనడం అబద్దమని.. అంత డబ్బుతో ఏకంగా ఒక పెద్ద నగరాన్ని నిర్మించవచ్చు.కానీ trs నిర్మించలేదు. సమస్యలు అన్ని అలాగే ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. లక్ష బెడ్ రూమ్ లు , ఉద్యోగ భర్తీ, నాలుగు హాస్పిటల్ లు కడుతామని చెప్పి కట్టలేదు… 2016 లో టీఆర్ఎస్  మేనిఫెస్టో ను వెబ్ సైట్ నుండి ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు.

ఎంఐఎం-బీజేపీ చీకటి ఒప్పందం

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం-బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుని.. ఓల్డ్ సిటీ లో ఉన్న  మైనార్టీలను భయ పెట్టడానికి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీ లు  భాగ్య లక్ష్మీ టెంపుల్ కు,ఓల్డ్ సిటీ కి వెళుతున్నాని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మందిరాలను రక్షించే బీజేపీ వాళ్లు సచివాలయం లో ఉన్న నల్ల పోచమ్మ టెంపుల్ సందర్శన కు ఎందుకు వెళ్లలేదు. మసీదు కూలగొడితే ఎందుకి ఎంఐఎం నాయకులు మాట్లాడలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ని బలహీన పరచాలని మా ఎమ్మెల్యేల ను ఎంపీలను, ఎమ్మెల్సీ లను గుంజు కున్నారు. కేసీఆర్ చేసిన దుర్మార్గాల వలన తెలంగాణ లో బీజేపీ బలపడుతుంది.. కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేయడం వలన ప్రతిపక్షం లేకుండా పోయింది.. అందుకే బీజేపీ బలపడుతోందన్నారు. మత విద్వేషాలను రెచ్చకొట్టి బీజేపీ బలపడాలని చూస్తోందన్నారు.

వరద సాయాన్ని పంది కొక్కులు లాగా మెక్కారు

భారీ వర్షాలు.. వరదలతో నష్టపోయిన వారికి ఇవ్వాల్సిన వరద సాయాన్ని టీఆర్ఎస్ నాయకులు పందికొక్కుల్లాగా తిన్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ని చూసి జాలి పడుతున్నా.. హైదరాబాద్ మేయర్ గా మాకు అవకాశం ఇవ్వండని  అమిత్ షా అడగడం విడ్డురంగా ఉంది….ప్రధానమంత్రి  మోడీ చేయలేని పని  మేయర్ చేస్తాడా.. ? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి చేసింది ఏముందని ప్రశ్నించారు. వరదలు అంచనా వేద్దామని వెళితే కనీసం ఎమ్మార్వో కూడా రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నాడు. ఆ లీడర్ సామాన్య జనాలకు ఏమి సాయం చేస్తాడు.. ? నిన్న హైదరాబాద్ కు మోడీ వస్తే కనీసం ప్రోటోకాల్ గా ఉన్న నన్ను  పిలవలేదన్నారు. గంగా నది ప్రక్షాళన కు నిధులు ఇచ్చినప్పుడు… మూసి నదికి ఎందుకు నిధులు కేటాయించడం లేదు..  ఓల్డ్ సిటీ లో ఎంఐఎం కు సహకరించడం కోసం బీజేపీ నేతలు ఓల్డ్ సిటీ కి వెళుతున్నారు…  బీజేపీ గెలిస్తే కేంద్రం నుండి ఎన్ని వేల కోట్లు పెట్టి అభివృద్ధి  చేస్తారో  అమిత్ షా ఎందుకు చెప్పలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్, అమిత్ షా మాటలు జోడెద్దు బండ్ల వారి మాటల్లా ఉన్నాయని.. ఇన్సూరెన్స్ ఉన్న బండ్ల కు కొత్త బండ్లు ఇప్పిస్తానని బండి సంజయ్ చెప్పడం విడ్డురంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల గురించి అసదుద్దీన్ భయపడుతున్నాడు..  అందుకే మైనార్టీ లను తన చుట్టూ పెట్టుకుంటున్నాడు..  కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు బీజేపీ, ఎంఐఎంలు మాట్లాడడం లేదు..బీజేపీ-ఎంఐఎం మధ్య అలయ్ బలయ్ ఉంది.. వారు చీకటి మిత్రులు… గ్రేటర్ లోఓటు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కేటీఆర్ ఈవెంట్ మేనేజర్

మంత్రి కేటీఆర్ పై ఎంపీ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీ కి ఇన్ని నిధులు కావాలని ఎప్పుడైనా మున్సిపల్ శాఖ మంత్రి కేసీఆర్ ను కలిశాడా?  ఏమైనా  ప్రణాళికలు ఉన్నాయా?  కేసీఆర్, కేటీఆర్ కు సమన్వయం లేదు.. కేటీఆర్ కు  శాఖ మీద అవగాహన లేసు. కేటీఆర్ అంటేనే అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ లే. కేటీఆర్  జీవితం అంతా నటననే. కేటీఆర్ ఎన్నికల ప్రచారం కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కు ఇచ్చారు..  కేసీఆర్ మీటింగ్ కు వచ్చిన వాళ్ళు అంత కూలీలే అసలైన కార్యకర్తలు ఎవ్వరు మీటింగ్ రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ లో ప్రశ్నించాలి అంటే మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి.. లేదంటే మా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో నాకు 25 మంది  కార్పొరేటర్ లను గెలిపించండి..  పేద వాళ్ల తరపున పోరాటం చేస్తానని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ కు వచ్చే వారంతా విజిటింగ్ ప్రొఫెసర్ లే..  మిడతాల దండు పడ్డట్టు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు,ఎంపీటీసీ లు జడ్పీటీసీ లు గ్రేటర్ ఎన్నికల మీద పడ్డారు… కరోనా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎటు వెళ్లారు..?  ప్రజలకు కష్టము వచ్చినప్పుడు మీరు అండగా ఉంటే ఇప్పుడు మీకు ఓట్లు వేసే వాళ్లు కదా..  వాజపేయి విగ్రహం పెట్టాలని సీఎం కేసీఆర్ ను కలిశారు. ఏమైంది 2ఏండ్లు గడిచినా ఇప్పటి వరకు వాజపేయి విగ్రహం పెట్టించలేదు..  మీ నాయకులను మీరు గుర్తించకుండా మా నాయకలను పార్టీలో చేర్పించు కుంటున్నారు.. తాగి బండి నడిపితే జైల్లో వేస్తున్నారు. తాగి ప్రభుత్వం ను నడుపుతున్న వారిని అండమాన్ జైల్లో వేయాలని రేవంత్ రెడ్డి సూచించారు.