మథిరలో కాంగ్రెస్, టీడీపీ కూటమిని ఘోరంగా ఓడించిన టీఆర్ఎస్

మథిరలో కాంగ్రెస్, టీడీపీ కూటమిని ఘోరంగా ఓడించిన టీఆర్ఎస్

మున్సిపల్ ఎన్నికల్లో మల్లు భట్టి విక్రమార్కకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు మథిర మున్సిపాలిటీలో టీఆర్ఎస్‌కు పట్టంకట్టారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, టీడీపీతో కలిసి పోటీ చేసింది. అయినా కూడా టీఆర్ఎస్‌ను ఎదురుకోలేకపోయింది. టీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది.