
ఉద్యమ పార్టీకి కశ్మీర్ సెంటిమెంట్ సెగ
BJPకి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆందోళన
నిన్నటి వరకు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన గులాబీ పార్టీ నేతలు.. ఇప్పట్లో ఎలక్షన్ రావొద్దని కోరుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్న నేతలు ఇప్పుడు ఆలోచలనలో పడ్డారు. తెలంగాణలో తమకు తిరుగులేదని అనుకుంటున్న ఆ పార్టీ నేతలకు.. కశ్మీర్ సెంటిమెంట్ భయపెడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడితేనే మంచిదనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో సార్ కార్ పదహారు లోక్ సభ స్థానాలు అనే నినాదంతో.. గులాబీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్న మోడీ హవా గులాబీ పార్టీ ఆశలకు గండి కొట్టింది. తెలంగాణలోని యూత్, ఉద్యోగులు బీజెపీ వైపు మొగ్గు చూపారు. దీంతో బీజేపీ 4 లోక్ సభ స్థానాల్లో గెలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితనే ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీపై రివేంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. అందుకోసం గులాబీ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం అయ్యింది. అంతలోనే పార్లమెంట్ లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు.. కశ్మీర్ ఇష్యూను పరిష్కారం చేయటంతో ఈ సెంటిమెంట్ టీఆర్ఎస్ నేతలను బెంబేలెత్తిస్తోంది.
నిన్నమొన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల్లో తమదే విజయమనుకున్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడు కనుక మున్సిపల్ ఎన్నికలు వస్తె.. బీజేపీకి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనీ టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వం విషయంలో యువత, ఎడ్యుకేటెడ్ జనం అంతా బీజేపీ వైపు వెళుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్లమెంట్ లో కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు చేయటంతో.. ఎక్కడ చూసినా బీజేపీ ఘనతపైనే చర్చ జరగటం టీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా యువత, అర్బన్ ఓటర్లలో బీజేపీపై ఫీల్ గుడ్ వాతావరణం క్రియేట్ అయిందనే చర్చ టీఆర్ఎస్ నేతల్లో ఉంది.
కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేయటంతో దేశవ్యాప్తంగా బీజేపీ హవా పెరిగిందని గులాబీ నేతలు భావిస్తున్నారు. దేశం మొత్తం మోడీ నాయకత్వాన్ని కొనియాడుతుందనే చర్చ అధికార పార్టీలో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన యువత, ఉద్యోగులు.. స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కే ఓటు వేస్తారని గులాబీ బాస్ భావించారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తే అర్బన్ ఓటర్లంతా బీజేపీ కే ఓట్లు వేస్తారనే భయం గులాబీ పార్టీలో మొదలైంది. ఈనెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే.. కమలం పార్టీ మరోసారి తమను దెబ్బ కొడుతుందని గులాబీ నేతలు జంకుతున్నారు. ఒక్కసారి అమిత్ షా, లేదా ప్రధాని మోడీ తెలంగాణలో అడుగుపెడితే ఆ పార్టీ బలం పెరుగుతోందని టీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు.
బీజేపీపై ఇప్పుడున్న సెంటి మెంట్ కు తోడు.. తమపై వ్యతిరేకత కూడా ప్రభావం చూపిస్తుందనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది