నాని, శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్‌’ సినిమాలో హైలైట్ ఫైట్ సీన్ ఇదే !

నాని, శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్‌’ సినిమాలో హైలైట్ ఫైట్ సీన్ ఇదే !

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. జూన్‌లో ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన మ్యాసీవ్ సెట్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ హై ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఫైట్ మాస్టర్ రియల్ సతీష్‌తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు. సినిమాలో ఈ యాక్షన్‌ సీన్స్‌ మేజర్‌‌ హైలైట్‌గా నిలవనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.

ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ‘దసరా’ లాంటి విజయం తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.  అనిరుధ్ రవిచంద్రన్‌ దీనికి సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషలలో వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.