
‘‘ఎంతటి నటవారసులైనా కష్టపడితేనే సినిమా ఇండస్ట్రీలో విజయం లభిస్తుంది. ఓ నెపో కిడ్‌గా ఈ విషయాన్ని చెబుతున్నా’అన్నాడు మంచు మనోజ్. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించిన ‘ఓ భామ అయ్యో రామ’చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
బిగ్ టికెట్‌ను లాంచ్ చేసిన మనోజ్ మాట్లాడుతూ ‘సుహాస్ ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగాడు. నెపో కిడ్స్ అయినా ఇక్కడ కష్టపడితేనే విజయం దక్కుతుంది.
యూట్యూబ్ నుంచి హీరోగా ఎదిగిన సుహాస్ జర్నీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సినిమా విజయం సాధించి దర్శకనిర్మాతలకు బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా’అన్నాడు. హీరోకు మావయ్యగా నటించానని, ఇందులోని లవ్ సీన్స్ ఎమోషనల్‌గా ఉంటాయని నటుడు ఆలీ చెప్పారు.
ALSO READ : విజయ్ దేవరకొండపై చర్యలు తీసుకోండి..సైబరాబాద్ పోలీసులకు జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశం
సుహాస్ మాట్లాడుతూ ‘ప్రతి అబ్బాయి సక్సెస్‌ఫుల్ జర్నీలో తల్లి, భార్య పాత్రలు కీలకం. ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషన్స్ మా చిత్రంలో హృదయాలను హత్తుకునేలా ఉంటాయి’అని చెప్పాడు.
తనకు ఇదొక లైఫ్ టైమ్ మెమొరీ అని దర్శకుడు తెలిపాడు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా రామ్ ఈ చిత్రం తీశాడని సుహాస్ పర్‌ఫార్మెన్స్ నెక్స్ట్ రేంజ్‌లో ఉంటుందని నిర్మాత తెలియజేశారు. హీరోయిన్ మాళవిక, నటుడు శ్రీనాథ్, దర్శకుడు విజయ్ కనకమేడల, సంగీత దర్శకుడు రధన్, రచయిత బీవీఎస్ రవి, కో ప్రొడ్యూసర్ ప్రదీప్ తాళ్ళపు రెడ్డి పాల్గొన్నారు.