
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. శనివారం హౌజ్ మోషన్ పిటిషన్ వేయగా..అంత అర్జెంట్ ఏముందంటూ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఎవరికి కేటాయించవద్దని...ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని టీఆర్ఎస్ ఇప్పటికే ఈసీకి లేఖ రాసింది. ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది.