ఏప్రిల్ 27న హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

ఏప్రిల్ 27న హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం 10 గంటలకల్లా పార్టీ ప్రతినిధులంతా సభా ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి 11గంటల వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 11.05గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వేదిక వద్దకు చేరుకోనున్నారు. పార్టీ పతాకావిష్కరణ, స్వాగతోపన్యాసం అనంతరం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ఈ సారి పార్టీ 11 తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ, ఆమోదం అనంతరం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగియనుంది. 

వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల ఛైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జెడ్పీటిసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు, ఛైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాలు, మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు పాల్గొననున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.

FOR MORE NEWS

ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంట్రీలకు ఆహ్వానం

బాలీవుడ్ను షేక్ చేస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2