ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంట్రీలకు ఆహ్వానం

ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ఎంట్రీలకు ఆహ్వానం

హైద‌రాబాద్ : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టేక్కించాలని ఇప్పటికే రకరకాల అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతున్న సంస్థ.. ఇప్పుడు మరో కాంటెస్ట్ ని తీసుకొచ్చింది. షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్న ట్లు తెలిపిన ఆర్టీసీ.. సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం, లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువగా రూ.100కే రోజంతా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్, కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు, తదితర అంశాలపై ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండే షార్ట్ ఫిలింలను తీసి పంపించాలని కోరింది. ఆర్టీసీ మీకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేస్తుందని... ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో మొదటి బహుమతి రూ.10 వేలు, రెండో బహుమతి రూ.5వేలు, మూడో బహుమతి రూ.2500 అందజేస్తామంది. 10 కన్సోలేషన్ బహుమతులు కూడా ఉంటాయని... ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకుంటే మీ పూర్తి వివరాలను ఏప్రిల్- 21 లోగా tsrtcshortfilmcontest@gmail.com పంపించాలని ఆహ్వానం కోరింది.