ఫ్లోరిడాలో హరీష్ రావు.. NRIలతో సమావేశం

ఫ్లోరిడాలో హరీష్ రావు.. NRIలతో సమావేశం
  •  దేశానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం.
  • చిరునవ్వుల తెలంగాణ సాధనే కేసీఆర్ లక్ష్యం
  •  సంస్కృతిని, సాంప్రదాయాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత ఎన్ ఆర్ ఐ లదే..
  •  నాటి ఉద్యమంలో..నేటి ప్రగతి లో ఎన్ఆర్ఐ లది కృషి మరువలేనిది.
  •   ఫ్లోరిడాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు.

చిరునవ్వుల తెలంగాణ చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ అమెరికా సెల్‌ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌ అన్నారు. 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. నాటి ఉద్యమం నుంచి నేటి అభివృద్ధిలోనూ ఎన్‌ఆర్‌ఐల పాత్ర కీలకంగా ఉందన్నారు. వ్యవసాయాన్ని ప్రొఫెషనల్‌గా చేసుకునే రోజులు రాబోతున్నాయన్నారు.

రైతులకు మిషన్ కాకతీయ, కాళేశ్వరం , పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని హరీష్ రావు అన్నారు. రైతు బంధు, రైతు భీమా , ఎరువులు విత్తనాల పంపిణీ , మార్కెటింగ్ వ్యవస్థ, మోటార్, స్టాటార్ లేని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు ఆత్మవిశ్వాసాన్ని నింపింది..వారి జీవితాల్లో భరోసానిచ్చింది టి ఆర్ ఎస్ కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు.

ఒకప్పుడు రైతు అంటే చిన్న చూపు ఉండే కానీ  టీఆర్ఆస్ ప్రభుత్వంలో రైతు అంటే గౌరవం పెరిగిందన్నారు. ఐటి ప్రొఫెషనల్ గా జాబ్ సంపాదించుకున్న వారు. వ్యవసాయాన్ని ప్రొఫెషనల్ గా చేసుకొనే రోజులు వచ్చే మరో నాలుగు ఏళ్లలో రాబోతున్నాయన్నారు హరీష్ రావు.