అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్ధినికి హరీష్ రావు సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్ధినికి హరీష్ రావు సాయం

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి ఆర్ధిక చేయూతనందించారు మాజీ మంత్రి హరీష్ రావ్. జహీరాబాద్ నియోజకవర్గం న్యాలకల్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్రవంతి గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. చిన్నమెదడు లోని నరాలు దెబ్బతినడంతో ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురైంది.

హైదరాబాద్ లోని హాస్పిటల్ తీసుకెళ్లగా.. వైద్యానికి 14 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడంతో ఆ పేద కుటుంబం ఇబ్బందులు పడింది. ఈ విషయం  ఆమె తల్లితండ్రులు స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావుకు విన్నవించడంతో  వెంటనే మాణిక్ రావు మాజీ మంత్రి హరీష్ రావ్  దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.

దీనిపై  వెంటనే స్పందించిన హరీష్ రావ్.. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 12 లక్షల రూపాయలను ఆ యువతికి చికిత్స నిమిత్తం మంజూరు చేశారు. అందుకు సంబంధించిన LOC ని శుక్రవారం స్రవంతి కుటుంబ సభ్యులకు అందజేశారు.

నిరుపేద రైతు కూలీలమైన తమ కూతురి ఆపరేషన్ కు తగిన సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాణిక్ రావు  లకు జీవితాంతం రుణపడి ఉంటామని స్రవంతి తల్లి తండ్రులు అన్నారు.

TRS leader Harish rao helps a poor, inter girl who is Suffering from illness