కేసీఆర్ పీఎం, కేటీఆర్ సీఎం కావాలని కోళ్లు, మద్యం పంపిణీ

కేసీఆర్ పీఎం, కేటీఆర్ సీఎం కావాలని కోళ్లు, మద్యం పంపిణీ

కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. వరంగల్ జిల్లాలో ఓ టీఆర్ఎస్ నేత నిరుపేద హమాలీలకు కోళ్లు, క్వార్టర్ బాటిళ్లను ఉచితంగా పంచి పెట్టాడు. దసరా పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి.. నిరుపేద హమాలీలకు వరంగల్ చౌరస్తాలో 200 కోళ్లు, 200 క్వార్టర్ బాటిళ్లను ఫ్రీగా పంపిణీ చేశాడు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి.. కేసీఆర్ ప్రధానిగా, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం కోళ్లు, మద్యం బాటిళ్ల పంపిణీపై సర్వత్రా చర్చ సాగుతోంది.