వరంగల్ లో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్ట్

వరంగల్ లో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్ట్

ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉద్రిక్తంగా మారడంతో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శంకరమ్మ తండా వద్ద  షర్మిల కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు మరోసారి రాళ్ల దాడి చేశారు. పోలీస్ బందోబస్తు ఉన్నా షర్మిల వాహనం అద్దాలు ధ్వంసం చేశారు.  టీఆర్ఎస్ కార్యకర్తలు వైయస్సార్ విగ్రహానికి  నిప్పు  పెట్టారు. దీంతో వైసీపీ, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.  వైఎస్ విగ్రహాన్ని, పార్టీ ఫ్లెక్సీలను దగ్ధం చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ లీడర్లు గ్రామస్తులపై కోడిగుడ్లు రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో భారీ పోలీస్ కాన్వాయ్ తో ఆమెను హైదరాబాద్ కు తరలించారు.  నర్సంపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. అసలు షర్మిలకు తెలంగాణలో పాదయాత్ర చేసే హక్కే లేదని గులాబీ నేతలు నిరసనకు దిగారు. గో బ్యాక్ షర్మిల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  షర్మిల ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.