బెంగళూరులో టీఆర్ఎస్​ లీడర్ల క్యాంపు

V6 Velugu Posted on Nov 28, 2021

వేములవాడ/గోదావరిఖని, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ​క్యాంపులు షురూ చేసింది. రామగుండం కార్పొరేషన్‌‌కు చెందిన కార్పొరేటర్లు శనివారం సాయంత్రం బెంగళూర్‌‌ క్యాంపునకు తరలివెళ్లారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ ఆధ్వర్యంలో మేయర్‌‌, డిప్యూటీ మేయర్‌‌తో పాటు కార్పొరేటర్లు, వారి కుటుంబసభ్యులు మూడు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరారు. 10న ఎన్నిక జరగనుండగా వీరంతా 7వ తేదీ తర్వాత గోదావరిఖనికి రానున్నట్టు సమాచారం.  వేములవాడ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు సుమారు 73 మంది సైతం క్యాంపులకు వెళ్లారు. వేములవాడ పట్టణంలోని 16 మంది కౌన్సిలర్లు వారి కుటుంబసభ్యులతో వెళ్లగా మరికొందరు రెండు మూడు రోజుల్లో వెళ్లనున్నారు. బెంగళూరు, గోవా, మహారాష్ట్రలో పది రోజుల టూర్​లో ఉంటారని సమాచారం. 
 

Tagged TRS, Telangana, MLC Elections, Bengalore, godavarikhani, leaders camp

Latest Videos

Subscribe Now

More News