
ధర్నాలు, నిరసనల అడ్డా.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్. ఇప్పుడిప్పుడు అక్కడ ధర్నాలు జరుగుతున్నా మొన్నటి దాకా ఎలాంటి ఆందోళనలు జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టింది. చౌక్‌ను ఎత్తేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. పలుసార్లు సీఎం కేసీఆర్ కూడా ధర్నా చౌక్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నారు. ‘‘ధర్నా చౌక్ గీన్నే ఉండాలంటే ఎట్ల.. ఏడుంటేంది? చేసేది ధర్నానా ఇంకోటా? దానికేం పట్టుదల నాకర్థం కాదు.. అదేమన్నా ప్రజలకు సంబంధించిన సమస్యనా?’’ అంటూ రుసరుసలాడారు. ఇప్పుడు టీఆర్ఎస్ ముఖ్య నేతలే ధర్నాచౌక్‌లో ఇట్ల ధర్నాకు దిగారు. బుధవారం కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ కోసం చేపట్టిన ఈ నిరసన దీక్షలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొని స్పీచ్లిచ్చారు.