షర్మిల యాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు

షర్మిల యాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల కేంద్రంలో ప్రజా ప్రస్థాన పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. షర్మిల నిర్వహిస్తున్న మాట ముచ్చట కార్యక్రమానికి అడ్డుతగిలారు.మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదె కిషోర్ ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ నాయకులు పాదయాత్రను అడ్డుకున్నారని వైఎస్సార్ టీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాట ముచ్చటను అడ్డుకునే ప్రయత్నం చేసిన నాయకులకు షర్మిల మాట్లాడే అవకాశమివ్వడంతో వారంతా వెనక్కి తగ్గారు. టీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం కారణంగా ప్రజాప్రస్థాన యాత్రలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

For more news..

వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన కోదండరాం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు