ఎముకలు బలంగా ఉండటానికి పాలు చాలా అవసరం, ఎందుకంటే వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ, చాలా మందికి పాలు తాగగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ఇంకా కొందరికి పాల వాసన పడదని తాగడం మానేస్తుంటారు, ఇంకొందరు పాలు అంటేనే దూరంగా ఉంటారు.
అయితే, పాలు తాగని వారు కాల్షియం కోసం ఏం చేయాలి అంటే అందుకు బాదం పాలు ఒక చక్కని పరిష్కారం. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం(Almond ) పాలు తాగడం వల్ల కలిగే 5 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను ఏంటో తెలుసుకుందామా....
బాదం పాలు తాగడం వల్ల కలిగే 5 లాభాలు:
1. బాదం పాలలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వులు (Saturated Fats) ఉండవు. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును (B.P) అదుపులో ఉంచి, గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
2. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. బాదం పాలలో మన శరీరానికి కావలసినంత కాల్షియం ఉంటుంది. కాల్షియం కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు దీనిని టీ లేదా స్మూతీలలో కూడా వాడుకోవచ్చు.
3. బాదంలో 'విటమిన్-E' పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి మీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. అలాగే సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది.
4. డయాబెటిస్ (షుగర్) ఉన్నవారికి బాదం పాలు చాలా మంచివి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. చక్కెర కలపకుండా తాగితే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు.
5. బాదంలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి బాదం పాలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి ఇంకా కాల్షియం, విటమిన్ E, విటమిన్ D అధికంగా ఉంటాయి. అయితే, రెడీమేడ్ బాదం పాల కాకుండా తాజా బాదం పాలను తాగడం చాల మంచిది. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్ బాదం పాలలో షుగర్ లేదా ఇతర ప్రిజర్వేటివ్స్ ఉండవచ్చు.
