జనగాలో హై టెన్షన్.. నల్ల జెండాలతో టీఆర్ఎస్ లీడర్ల నిరసన

జనగాలో హై టెన్షన్.. నల్ల జెండాలతో టీఆర్ఎస్ లీడర్ల నిరసన

జనగామలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బండి సంజయ్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ లీడర్లు నిరసన చేపట్టారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ ప్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. నల్ల జెండాలు పట్టుకుని బైఠాయించారు. బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నేతలు చింపివేశారు. టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరును బీజేపీ నేతలు ఎండగడుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కు సంబంధించిన పోలీసులు పామునూరు చేరుకున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు. 

బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. 20వ రోజు పామునూరు నుంచి ప్రారంభించారు. బీజేవైఎం నేతల అరెస్టును నిరసిస్తూ.. మౌన దీక్ష చేయాలని ప్రయత్నించిన బండి సంజయ్ ను అరెస్టు చేయడంతో ఒక్కసారిగా పరిణామాలు వేడెక్కాయి. ఆయన్ను అరెస్టు చేయడంపై నేతలు ఫైర్ అయ్యారు. అసలు అరెస్టు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. శాంతియుతంగా చేపట్టే దీక్షను భగ్నం చేయడం కరెక్టు కాదన్నారు.