‘కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా.. ఈ హత్య చేశారా..?’

‘కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్ గా.. ఈ హత్య చేశారా..?’

హైదరాబాద్: మంథిని ప్రాంతంలో టీఆరెస్ లీడర్ల అరాచకానికి పోలీసులే సపోర్ట్ చేస్తున్నారని , వామనరావు దంపతుల హత్యలో  టీఆరెస్ నేతలే కీరోల్ గా వున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  ఇసుక అక్రమాలు, టీఆరెస్ అరాచకాలకు వామనరావు దంపతులు అడ్డుపడుతున్నారని, టీఆర్ఎస్ లీడర్ పుట్ట మధు ప్రోత్సహంతోనే ఈ హత్య జరిగిందని ఆయన అన్నారు.

గతంలో మంథని పోలీస్ స్టేషన్లో రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామానికి చెందిన దళితుడు శీలం రంగయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని,  అతని లాకప్ డెత్ బయటికి తీయడానికి వామనరావు ఫైట్ చేస్తున్నారని అన్నారు. ఆ డెత్ మిస్టరీ బయటికి రాకుండా ఉండడానికి లాయర్ దంపతులను హత్య చేశారని ఆయన అన్నారు

వారం రోజుల క్రితం హాలియా సభలో కేసీఆర్.. టీఆరెస్ పార్టీ ని విమర్శిస్తే.. నశం నశం చేస్తామన్నారని , బహుశా.. కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్ గానే.. ఈ హత్య చేశారా.. అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో వంగవీటి మోహన రంగ హత్య ఎలా జరిగిందో అలా చేశారని,  అప్పుడు టిడిపి ఎలా వ్యవహరించిందో.. ఇప్పుడు అలా టీఆరెస్ వ్యవహరిస్తోందన్నారు. పోలీసులు..ఈ రాష్ట్రంలో టీఆరెస్ లీడర్లకే ఫ్రెండ్లి పోలీస్ లు గా పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ హత్యతో కేవలం మంథిని ప్రాంతానికే కాక.. రాష్ట్రం మొత్తం ఉలికి పడిందని, ఈ కేసులో నిర్లక్ష్యం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  హై కోర్ట్ ఈ హత్య కేసును సుమోటా కేసు గా తీసుకుంది, కానీ ఈ మర్డర్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణలనే ఈ హత్యలో కీలకమైన వ్యక్తి ఎవరో సిబిఐ విచారణలోనే తేలుతుందని అన్నారు.