TRS అంటే తెలంగాణ రైతు సమితి

TRS అంటే తెలంగాణ రైతు సమితి

ఇక నుంచి TRS అంటే తెలంగాణ రైతు సమితి అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్లలో జరిగిన రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. ఏడున్నరేళ్లలో మళ్లీ తాము ఎందుకు రోడ్లు ఎక్కాల్సి వచ్చిందో రైతులు ఆలోచించాలన్నారు. బీజేపోల్లకు హిందు ముస్లిం పేరుతో లొల్లిపెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవడమొక్కటే తెలుసన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించామని... బీజేపీ మెడలు వంచలేమా అని అన్నారు.