జీహెచ్​ఎంసీ ఎలక్షన్లపై టీఆర్​ఎస్​-ఎంఐఎం కుట్ర

జీహెచ్​ఎంసీ ఎలక్షన్లపై టీఆర్​ఎస్​-ఎంఐఎం కుట్ర

63 డివిజన్లలో హిందూ ఓట్లను తొలగించిన్రు
సీఎం చెప్పినట్లు చేస్తున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్​
రూ.10వేల వరద సాయంలో పెద్ద స్కామ్​
సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలి
బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ డిమాండ్​

కరీంనగర్సిటీ, హైదరాబాద్, వెలుగు:దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు స్ఫూర్తి దాయకనమని బీజేపీ చీఫ్‍, కరీంనగర్‍ ఎంపీ బండి సంజయ్‍కుమార్‍ అన్నారు. బైఎలక్షన్ ఘన విజయం తర్వాత ఫస్ట్​టైమ్ శుక్రవారం కరీంనగర్‍ వచ్చిన ఆయనకు నాయకులు, క్యాడర్ శాలువాలు కప్పి విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్‍ఎంసీ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురవేస్తామన్నారు. దుబ్బాకలో బీజేపీని గెలుపును ఆత్మహత్య చేసుకున్న పార్టీ కార్యకర్త శ్రీనివాస్‍కు అంకితం చేస్తున్నామని చెప్పారు. రానున్న గ్రేటర్​లో ఎన్నికల్లో బీజేపీ 100కు పైగా స్థానాలు గెలుస్తుందని సర్వేల ద్వారా తెలుసుకున్న సీఎం కేసీఆర్‍ ఎంఐఎంకు మేయర్‍ పదవి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‍లోని 63 డివిజన్లలో హిందువుల ఓట్లు తొలగించి ఎంఐఎంను గెలిపించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. హైదరాబాద్‍ ప్రజలు ఇది గమనించి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పాలన ప్రగతిభవన్‍ నుంచి నడుస్తుందా.. దారుసలెం నుంచి నడుస్తోందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎంఐఎం చెప్పినట్లు సీఎం చేస్తరు.. సీఎం చెప్పినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‍ పనిచేస్తోందని.. ఈ పక్షపాత ధోరణి సరైంది కాదన్నారు.  ఎస్​ఈసీ బాధ్యతాయుతంగా వ్యవహరంచడం లేదన్నారు.

డబుల్‍ ఇండ్లు ఎన్నికల స్టంట్‍

జీహెచ్‍ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో ఆరేండ్ల తర్వాత సీఎం కేసీఆర్‍ మళ్లీ డబల్‍ బెడ్‍ రూమ్‍ ఇండ్లు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. హైదరాబాద్‍ను ఎన్నడూలేనంతగా వరదలు ముంచెత్తుతే ఒక రోజు కూడా సీఎం బయటికి వచ్చి చూడలేదన్నారు. చెరువులు, కుంటల, నాలాలు ఎవరూ కబ్జా చేశారో చెప్పాలని డిమాండ్‍ చేశారు. వరదలతో సర్వం కోల్పోయిన ప్రజల్లో రూ.10 వేల ఆర్థిక సాయం ఎంతమందికి ఇచ్చారో వైట్ పేపర్​ రిలీజ్​ చేయాలని డిమాండ్ చేశారు.10వేల సాయం వెనక పెద్ద స్కాం ఉందని దీనిపై సిట్టింగ్‍ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‍ చేశారు.