
హైదరాబాద్: తనను TRS ఎమ్మెల్యే అనుచరులు దారుణంగా కొట్టారని తెలిపాడు ఓ వ్యక్తి. శాంతియుతంగా నిరసన చేస్తున్నవారికి సహకరించినందుకు.. మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు తనపై దాడి చేసినట్లు తెలిపాడు. మల్కాజ్‌గిరిలో ఆర్‌యూబీ సమస్యపై శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీజేపీ కార్యకర్తలు, స్థానికులపై మైనంపల్లి అనుచరులు రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారని తెలిపాడు. ఎమ్మెల్యే మైనంపల్లి సమక్షంలోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారని చెప్పాడు.
“మల్కాజిగిరిలో 5సంవత్సరాలుగా ఆనంద్ బాగ్ ఆర్.యూ.బీ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. దీనిపై స్థానికులు, రాజకీయ నాయకులు పలుసార్లు నిరసన తెలిపారు. ఈ పనులను పరిశీలించడానికి మంగళవారం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్థానిక కార్యకర్తలతో వచ్చారు. సమావేశంలో ప్లైకార్డ్లు పట్టుకుని స్థానికులు, BJP నాయకులు మౌనంగా నిరసన తెలుపుతుండగా TRS కార్యకర్తలు సహనం కోల్పోయారు .
నేను గాంధీని కాదు, మీరు ఇలా చేస్తే మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు అని ఎమ్మెల్యే మైనంపల్లి ఆవేశంలో ప్రసంగించారు. దీంతో మౌనంగా నిరసన తెలుపుతున్న స్థానికులు, BJP కార్యకర్తలపై TRS కార్యకర్తలు మూకముడిగా దాడి చేశారు” అని తెలిపాడు గాయపడ్డ వ్యక్తి.
ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ట్రీట్ మెంట్ కోసం హస్పిటల్ కి తరలించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.