ముస్లింల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రమిస్తోంది

ముస్లింల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రమిస్తోంది

మైనారిటీలకు ఉన్నత పదవులిచ్చి సీఎం కేసీఆర్ ముస్లింల అభిమానాన్ని చాటుకున్నారన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. బుధవారం సిద్దిపేటలో మాట్లాడుతూ.. ముస్లింల ఉన్నతి కోసం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హజ్ హౌస్ ” సింగల్ విండో” కానుందని తెలిపారు. తెలంగాణ లోని అన్ని ముఖ్య పట్టణాలలో ఇలాంటి హజ్ హౌస్ లు నిర్మాణం జరగనున్నాయన్నారు.

సీఎం కేసీఆర్ చూపించిన దారిలోనే సిద్దిపేటలో అభివృద్ధి పరంపర కొనసాగుతుందని హరీశ్ అన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు. ముస్లిం పిల్లల చదువుకై ప్రభుత్వం అన్నిరకాల సదుపాయాలతో 204 ముస్లిం మైనారిటీ స్కూల్స్ నిర్మించిందని అన్నారు. ప్రస్తుతం ఆ స్కూళ్లలో యాబై వేలమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. అందరూ బాధ్యత తీసుకొని విద్యార్థులను బడిలో చేర్పించాలని ముస్లిం సోదరులకు హరీశ్ సూచించారు.