కాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

కాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

కాసేపట్లో ఈడీ విచారణకు హాజరుకానున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. నిన్న MLA పైలట్ రోహిత్ రెడ్డిని దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. అయితే విచారణలో కేవలం బయోడేటా మాత్రమే అడిగారన్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఏ కేసులో విచారణ జరుపుతున్నారో కూడా అధికారులు చెప్పలేదన్నారు. మళ్లీ ఇవాళ ఉదయం పదిన్నరకు విచారణకు రమ్మన్నట్లు తెలిపారు. వ్యాపార లావాదేవీలు అడిగి తెలుసుకున్నారన్న రోహిత్ రెడ్డి... మనీలాండరింగ్ ఇష్యూపై ఎలాంటి వివరాలు అడగలేదన్నారు. ఏమి అడిగినా సహకరించాలని మాత్రమే అంటున్నారన్నారు.  

గచ్చిబౌలి సీఏ ఇంట్లో పైలట్ రోహిత్ రెడ్డి చర్చలు 

గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని ఛార్టెడ్ అకౌంటెంట్ నివాసంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్  రెడ్డి చర్చిస్తున్నారు. ఈడీ కోరిన వివరాలపై సీఏతో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇవాళ ఉదయం 10:30 గంటలకే ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా ఇంకా ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోనే ఉన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. 

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణపై ట్విస్టుల మీద ట్విస్టులు నడిచాయి. రాహుకాలం ముగిసింది ఎంక్వైరీకి రెడీ అన్నారు. ఈడీ విచారణ కోసమంటూ.. ఉదయం మణికొండలోని తన ఇంటి నుంచి బయల్దేరిన రోహిత్ రెడ్డి.. అక్కడి నుంచి ప్రగతిభవన్ కు వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కాలేనంటూ తన పీఏ ద్వారా ఈడీకి లెటర్ పంపించారు. వ్యక్తిగత కారణాలు, అయ్యప్ప మాలలో ఉన్నందున ఈ నెల 25 తర్వాత విచారణకు వస్తానని చెప్పినట్టు సమాచారం. 

ఈడీ అధికారులు రోహిత్ రెడ్డి ప్రపోజల్ ను పక్కన పెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఎంక్వైరీకి రావాల్సిందే అని చెప్పారు. దీంతో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీస్ కు మధ్యాహ్నం మూడున్నరకు వెళ్లారు. ఆస్తి పత్రాలు, అందుబాటులో ఉన్న బ్యాంక్ స్టేట్ మెంట్లు తీసుకెళ్లారు. ఆడిటర్, అడ్వకేట్ లేకుండానే విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు రోహిత్ రెడ్డి. వ్యక్తిగత కారణాలతో కొంత సమయం అడిగానని, కానీ ఈడీ అధికారులు ఇవ్వకపోవడంతో విచారణకు హాజరయ్యానని చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత రాత్రి మీడియాతో మాట్లాడారు రోహిత్ రెడ్డి. ఈడీ ఫార్మాట్ లో తన దగ్గరున్న వివరాలు ఇచ్చానన్నారు. కేసులకు గానీ, ఇల్లీగల్ ట్రాన్సక్షన్స్ కు సంబంధించి కానీ అడగలేదని చెప్పారు. తనను ఏ కేసులో పిలుస్తున్నారో తెలియదన్నారు. ఆర్థిక లావాదేవీల పత్రాలు తీసుకురావాలని చెప్పారన్నారు రోహిత్ రెడ్డి.