గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారు

గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారు


గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. రాజ్ భవన్ లో జరిగింది  ప్రజా దర్బార్ కాదు.. పొలిటికల్ దర్బార్ అని అన్నారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని అరోపించారు. 2013లో గవర్నర్ దర్బార్ లు నిర్వహిస్తే గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ.. అప్పుడు ప్రధానికి పిర్యాదు చేశారని గుర్తుచేశారు.  అటు మహిళా దర్బార్‌ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు తమ సమస్యలను గవర్నర్ కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మహిళా దర్బార్‌కు వచ్చిన వారితో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను విని, తప్పకుండా పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. తనని ఆపే శక్తి ఎవరికీ లేదని,  మహిళలు ఇబ్బంది పడితే తాను చూస్తూ ఉండలేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, బాధిత మహిళలకు మధ్య వారధిగా ఉంటానని హామీ ఇచ్చారు.