టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోయి తప్పి మాట్లాడుతున్నారన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ . ఉత్తమ్‌కు ఇంటి పోరు ఎక్కువై అలా మాట్లాడుతున్నారని, ఉత్తమ్ తీరు కాంగ్రెస్ కార్యకర్తలకే నచ్చడం లేదని చెప్పారు. అధికారిక కార్యక్రమంలో కనీస మర్యాద లేకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎక్కడ ఆగాయో కాంగ్రెస్ నేతలు నిరూపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లకు నడక నేర్పింది టీఆరెస్ ప్రభుత్వం అనేది మర్చిపోవద్దన్నారు. బడ్జెట్ అంతా ప్రతి శాఖలో ప్రతి రూపాయితో లెక్కలు చూపించామని,చెప్పామని అన్నారు. తాము అభివృద్ధి చేసాం కాబట్టే ప్రజలు తమ వెంట ఉన్నారన్నారు. ప్రభుత్వానికి సలహాలు-సూచనలు ఇవ్వకుండా ప్రతినిమిషం రాజకీయం చేస్తున్నారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేస్తే ఆయన్ని జంతువు కూడా పట్టించుకోదు.కాంగ్రెస్ నేత రేవంత్ అమరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కర్నె ప్రభాకర్ అన్నారు.
