ఢిల్లీ లిక్కర్​ స్కాం: సీబీఐ నోటీసులకు కల్వకుంట్ల కవిత ప్రతిస్పందన

ఢిల్లీ లిక్కర్​ స్కాం: సీబీఐ నోటీసులకు కల్వకుంట్ల కవిత ప్రతిస్పందన

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో వివరణ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. తన వివరణ తీసుకోవాలని భావిస్తున్నామని పేర్కొంటూ శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసును సీబీఐ ఇష్యూ చేసింది. దానికి కవిత స్పందిస్తూ.. సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి ఇవాళ లేఖ రాశారు.  సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కవిత కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.