
పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు లభిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా మేడే రాజీవ్ సాగర్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత దంపతుల సమక్షంలో రాజీవ్ సాగర్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టే ముందు ఆయన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని రాజీవ్ సాగర్ తెలిపారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని.. ప్రస్తుతం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఆమె అన్నారు. ఇక ముందు కూడా ఇలాగే కష్టపడి పనిచేయాలి. దేశంలో మన పాత్ర కీలకంగా ఉండాలన్నారు. పని చేసే కార్యకర్తలు సమయం కోసం వేచి చూడాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.