బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతరు కానీ పని చెయ్యరు : కవిత

బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతరు  కానీ పని చెయ్యరు : కవిత

రాష్ట్రానికి ప్రధాని మోడీ మరోసారి ఉత్త చేతులతో వచ్చారని టీఆర్ఎస్  ఎమ్మెల్సీ   కవిత అన్నారు. ఖాళీ చేతులతో వచ్చి మోడీ ఉత్త మాటలు చెబుతున్నారు కానీ పనులు చేయడం  లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని సార్లు  అభివృద్ధి పనులపై  ప్రశ్నించినా ప్రధాని మోడీ సమాధానం  చెప్పడం లేదని విమర్శించారు.  బీజేపీ, కాంగ్రెస్ నేతలు  మాట్లాడుతారని  కానీ పనిచేయరన్నారు.

 పనిచేసే ప్రభుత్వాలు, ఉత్త మాటలు చెప్పే ప్రభుత్వాలను ప్రజలు గమనించాలని కవిత సూచించారు. టీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ అన్ని రంగాల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. జగిత్యాల జిల్లా రాయికల్  పట్టణంలో జరిగిన  టీఆర్ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు.