ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలం

ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలం

న్యూఢిల్లీ: దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, మాలోత్ కవిత, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ... కాంగ్రెస్ రాష్ట్రంలో, దేశంలో ప్రతిపక్షంగా ఉండి అసలు ఏం చేస్తుందో చెప్పాలన్నారు. రైతుల విషయంలో రాజీపడేది లేదని, కేంద్రం వడ్లు కొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఓబీసీ గణనపై చర్చ కోసం వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. కేంద్రం బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉందని.. పేదలకు లబ్ధి జరగాలంటే, కుల గణన జరగాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామన్నారు.

మరిన్ని వార్తల కోసం..

సాధించాలంటే కసి ఒక్కటే సరిపోదు.. అంతే కష్టపడాల

రెండేళ్లుగా కారులోనే నివాసముంటున్న మహిళ