ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వట్లేదు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వట్లేదు

తెలంగాణ ప్రభుత్వం రైతుల‌కు అండ‌గా నిల‌వ‌డం కారణంగానే  రాష్ట్రంలో వ‌రిపంట ఉత్ప‌త్తి రికార్డు స్థాయిలో న‌మోదు అయ్యింద‌న్నారు టీఆర్ఎస్ నేతలు. ఢిల్లీ తెలంగాణ భవన్లో  టీఆర్ఎస్ ఎంపీల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామానాగేశ్వరరావు మాట్లాడారు . ధాన్యం కొనుగోలుపై తాము అడిగింది చాలా స్పష్టం ఉందన్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తమను అనరాని మాటలు అన్నాడని..ఆ స్థాయికి దిగజారాలనుకోవడం లేదన్నారు. ఆయన ఏం చెప్తున్నాడో.. ఆయనకే అర్థం కావడం లేదన్నారు. అంతేకాదు.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వట్లేదన్నారు.

ఈసారి సాగు ఎక్కువగా సాగు ఉందని.. పంట ఎక్కువగా వచ్చిన పంటను తీసుకోవాలని కోరామన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఇదే విషయంపై  మంత్రి కిషన్ రెడ్డితో చెప్పామన్నారు. వరిని కొనేందుకు ఒప్పుకున్నారని..అయితే అదే విషయాన్ని  పీయూష్ గోయల్ తో చెప్పించాలని అడిగామన్నారు. ఇప్పుడే బాయిల్డ్ రైస్ తీసుకోబోమని చెప్పవద్దని..రైతులకు అవగాహన కల్పించిన తర్వాత  బాయిల్డ్ రైస్ కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు.

ప్రతి రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నామని..ఒకటే డిమాండ్ చేస్తున్నామన్న టీఆర్ఎస్ ఎంపీలు.. ఏదో ఒక సభలో ధాన్యం కొనుగోలుపై  ప్రకటన ఇవ్వాలని కోరుతున్నామన్నారు.  ఏమి లేకుండా మైక్ ఇచ్చినట్లే ఇచ్చి.. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మైక్ కట్ చేశారని ఆరోపించారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర సమస్య పరిష్కారించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కి ఉంటుందన్నారు టీఆర్ఎస్ ఎంపీలు.