వరంగల్ డిక్లరేషన్ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోక తప్పదు

వరంగల్ డిక్లరేషన్ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోక తప్పదు

కరీంనగర్: రాహుల్ గాంధీ సభ విజయవంతమైన స్ఫూర్తితో ప్రజల్లోకి పోతామని, కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ సునామీలో టీఆర్ఎస్ కొట్టుకుపోక తప్పదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ లకు అధికార బలం ఉంటే... కాంగ్రెస్ పార్టీకి జన బలం ఉందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఊరూరా తీసుకెళ్తామన్నారు. 
బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని విమర్శిస్తున్న బండి సంజయ్... కాకినాడ లో చేసిన ఒక్క పార్టీ రెండు రాష్ట్రాల తీర్మానం ఎందుకు అమలు చేయలేదో చెప్పి పాదయాత్ర చేయాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అవినీతికీ పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 
బీజేపీ, టీఆర్ఎస్ గొడవల వల్లే మిల్లర్లపై వేధింపులు జరుగుతున్నాయని, నిజంగా అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ పంట సమయంలోనే  ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్కు మూత పడితే పట్టించుకోవడం లేదు.. కానీ కేటీఆర్ వరంగల్ టెక్స్ టైల్ పార్కు పేరిట హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కేవలం మత పరంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి గెలవాలని బీజేపీ చూస్తోందన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో మా పార్టీ చేసిన  జాప్యం వల్ల ఓడిపోయామన్నారు. రెండు ఆంబోతులు కొట్లాడుకుంటుంటే ప్రజలు కూడా ఓ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మా పార్టీలో ఉన్న గోడ మీద పిల్లులకు రాహుల్ వార్నింగ్ ఇచ్చారని, విబేధాలు, అభిప్రాయ బేధాలుంటే ఇంటర్నల్ వేదికలపై మాట్లాడుకుంటామన్నారు పొన్నం ప్రభాకర్. 

 

 

ఇవి కూడా చదవండి

నేను... అమ్మను

సిలిండర్ ధరల పెరుగుదలపై రాహుల్ సెటైర్లు

పామాయిల్ సాగు విస్తరణకు రైతులు ఆసక్తి