నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠం టీఆర్ఎస్‌దే

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠం టీఆర్ఎస్‌దే

నీదా.. నాదా అన్నట్లు నిన్నటి నుంచి తీవ్ర ఉత్కంఠ రేపిన నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠం చివరికి అధికార టీఆర్ఎస్ వశమయింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరిగిపోయింది. కానీ, సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మాత్రం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిన్న ఆగిపోయింది. ఆ ప్రక్రియ ఈ రోజు ముగిసింది. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. నేరేడుచర్లలో టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు చేరో 10 మంది సభ్యుల బలం ఉంది. అయితే శేరి సుభాష్ రెడ్డి ఓటుతో టీఆర్ఎస్‌ బలం 11కి చేరింది. దాంతో చైర్మన్ పీఠం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైర్మన్‌గా చందమల్లు జయబాబును, వైస్ చైర్మన్‌గా చల్లా శ్రీలతా రెడ్డిని ఎన్నుకున్నారు.

For More News..

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్టు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

జాబ్ కన్నా.. బిజినెస్ బెటర్ అంటున్న యువతులు