ఇసుక దందాలో బడా లీడర్లు .. వాళ్లలో అధికార పార్టీ నేతలే ఎక్కువ

ఇసుక దందాలో బడా లీడర్లు .. వాళ్లలో అధికార పార్టీ నేతలే ఎక్కువ
  • సర్కారు క్వారీలన్నీ కీలక నేతల చేతుల్లోనే
  • ఒక్క పర్మిట్తో అంతకు పది రెట్ల రవాణా
  • కృష్ణా , గోదావరి వెంట తోడుడే తోడుడు
  • ఆన్లైన్ బుకింగ్లోనూ వారిదే హవా
  • నెలకు రూ. 450 కోట్లకుపైగా వ్యాపారం

ఆన్ లైన్​లో బుక్ చేసుకున్న వారికి.. నేరుగా ఇంటికే ఇసుక రవాణా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ.. రాష్ట్రమంతటా ఎక్కడ పడితే అక్కడ ఇసుక అక్రమరవాణా.. అమ్మకాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు బడా లీడర్లు.. తమ అనుచరులను రంగంలోకి దింపి లారీల కొద్దీ ఇసుకను అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపనుల పేరిట.. అటు గోదావరి నుంచి ఇటు కృష్ణా పరీవాహకంలోని అన్ని వాగుల నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని సిటీలు, టౌన్లకు రోజూ ఇసుక తరలిపోతోంది. టీఎస్‌‌‌‌‌‌‌‌ఎండీసీ రాష్ట్రం లో రోజుకు 60 వేల టన్నుల ఇసుక తవ్వకం, రవాణాకు అనుమతి ఇస్తుండగా.. అంతకు మించిన ఇసుకను బ్లాక్‌‌‌‌‌‌‌‌ లో తరలిస్తున్నారు. దాదాపు నెలకు రూ. 450 కోట్లవిలువైన ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇందులో సగం సొమ్ము రాష్ట్రస్థాయిలో ఉన్నకొందరు బడా లీడర్లకు..ఎప్పటికప్పుడు వాటాలుగా ముడుతోందని ప్రచారంలో ఉంది. కృష్ణా , గోదావరి నదులతోపాటు వాటి ఉప నదులు, వాగులు, వంకలు.. ఎక్కడ చూసినా ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.

అడ్డు తగిలే ఆఫీసర్లపై వేటు

ఊళలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ప్రాజెక్టులు, రోడ్ల అభివృద్ధిపనుల పేరుతో అధికారిక రీచ్ ల నుంచి ఇసుక తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోకల్ ఆఫీసరపై ఒత్తిడి పెంచి అక్కడి వాగుల్లో పర్మిట్లు పొందుతున్నారు. అదే పర్మిట్ను చూపించి అంతకు పది రెట్లుఅధికంగా ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక దందాకు ఏ ఆఫీసరైనా అడ్డు పడితే.. నయానో భయానో వారిని మేనేజ్ చేసుకుంటున్నారు. వినని వాళను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేయిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇసుక మాఫియా కోరలు చాచింది.

కొందరు బడా నేతలు ఇసుక దందాను తమ సంపాదనకు రాచమార్గంగా ఎంచుకున్నారు. మరికొందరు తమ అనుచరులు, బడా కాంట్రాక్టర్లను రంగంలోకి దింపి దందా నడిపిస్తున్నారు. ఇంకొందరైతే  లోకల్ లీడర్ల సహకారంతో వ్యాపారం జేస్తున్నారు. తమ దందాకు ఎవరైనా ఆఫీసర్లు​ అడ్డు వస్తే.. వారిని భయపెడుతున్నారు. వినకుంటే పరపతిని ఉపయోగించి ట్రాన్స్​ఫర్లు చేయిస్తున్నారు. తవ్వకాలు ఆపాలని రైతులు అడ్డుకుంటే వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని గోదావరి తీరం వెంబడి ఇసుక రీచ్‌లన్నీ ఓ కీలక నేత కనుసన్నల్లో సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లోనూ లీడర్లు, వారి అనుచరులు ఇసుక దందాను దర్జాగా సాగిస్తున్నారు.

అన్ని జిల్లాల్లో సిండికేట్

  • ఇసుక దందాలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన లీడర్లు ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడ టిప్పర్‌ ‌‌‌‌‌‌‌ఇసుక తీయాలంటే పవర్ లో ఉన్నవాళ్లుచెప్పితీరాల్సిందే. ఇసుక రవాణాకు అడ్డుతగులుతున్నాడని ఓ డీఎస్పీని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌ చేయించటం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇదే జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు నేరుగా ఈ దందాలో తలమునకలై ఉన్నారు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసీ నది నుంచి రోజూ వందల ట్రిప్పుల ఇసుక హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలిస్తున్నారు. జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్న నేతలే ఇక్కడ రింగ్ తిప్పుతున్నారు. సరళాసాగర్‌‌‌‌‌‌‌‌ కట్టతెగి మేట వేసిన ఇసుకను ఓ కీలక నేత భారీ వ్యాపారంగా మలుచుకున్నారు. అధికార పార్కి టీ చెందిన ఒక లీడర్ బావమరిదే రింగ్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ కావటం.. మరో నియోజకవర్గ లీడర్ ఆధ్వర్యంలోనే రెండు రీచ్‌లు నడుస్తుండటం బహిరంగంగానే ప్రచారంలో ఉంది.
  • ఉమ్మడి కరీంనగర్ ‌‌‌‌‌‌‌‌జిల్లాలో స్వయంగా రాష్ట్రస్థాయి నేతలే ఇసుక దందాలో కూరుకున్నారు. గోదావరిని అడ్డాగా చేసుకొని కొందరు, మానేరులో తిష్టవేసి ఇంకొందరు అక్రమ రవాణా సాగిస్తున్నారు. మిడ్‌‌‌‌‌‌‌‌మానేరు నిండటంతో సిరిసిల్ల నుంచి ఇన్నాళ్లూ సాగిన దందా ఆగిపోయింది. మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌కోసంఒక క్వారీకి పర్మిషన్‌ ‌‌‌‌‌‌‌ఇవ్వగా లారీలు రాకుండా స్థానికులు అడ్డుకున్నా రు. గోదావరిలో ఇసుక దోపిడీని ఆపేయాలంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నిస్తానని హెచ్చరించడం రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం సృష్టించింది. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లకు ఎలాంటి ఫైన్‌‌‌‌‌‌‌‌లేకుండా విడిచిపెట్టాలని ఆఫీసరపై ఓ ఎమ్మెల్యే పెద్ద స్థాయిలో ఒత్తిడి చేయడం బయటికి వచ్చింది.
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇసుక దందాలో నేరుగా నలుగురు లీడర్లు పాత్రధారులుగా ఉన్నారు. కోటపల్లి సమీపంలోని ఇసుక రీచ్‌లను హైదరాబాద్ నుంచి ఓ కీలక వ్యక్తి ఆపరేట్‌  ‌‌‌‌‌‌‌చేస్తున్నారని సమాచారం.  సిరిసిల్ల నుంచి ఇసుక
    రవాణా బంద్‌కావడంతో  కోటపల్లికి తమ మకాం మార్చినట్టుగా తెలుస్తోంది. పెన్‌‌‌‌ ‌‌‌‌గంగా, గోదావరి, పెద్దవాగు, పెంబి, రాజురా, స్వర్ణతదితర వాగుల నుంచి ముఖ్య నేతలు, వారి కుటుంబీకులు, అను చరులే ఇసుక దందా చేస్తున్నారు.
  • మెదక్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ని మంజీరా నదిపై ఇసుక రీచ్‌లు ఆయా ప్రాంతాల్లోని ముఖ్య నేతల కనుసన్నల్లోనే  సాగుతున్నాయి. ఇక్కడి రీచుల్లోరాష్ట్రనేతలు కొందరికి వాటాలున్నాయని స్థానికులు అనుకుంటున్నారు. నిజామాబాద్ ‌జిల్లాలోని ఓ ఎమ్మెల్యే  సోదరుడు నేరుగా ఇసుక దందాను తన ఆదాయంగా మలుచుకున్నారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లీడర్లోతో పాటు పోలీసు ఆఫీసర అనుచరులు ఇసుక దందా సాగిస్తున్నారు. గిరిజనుల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన రీచ్‌లను ఇక్కడ లీడర్ ఆంధ్రా ప్రాంత వ్యాపారులకు కట్టబెట్టారు. ఖమ్మంలో రీచ్‌లు లేకున్నాపాలేరు, మున్నేరు, కట్టలేరు వాగుల నుంచి ఇసుక తోడి అమ్మేస్తున్నారు.
  • వరంగల్‌‌‌‌‌‌‌‌జిల్లాలో బడా లీడర అనుచరులు పెద్ద ఎత్తున ఇసుక దందా సాగిస్తున్నా రు. భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ రీచ్‌ల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో నూ అధికార పార్టీ లీడర్లు ఈ దందా వెనుక చక్రం తిప్పుతున్నారు.

ఆన్ లైన్కోటాలోనూ చేతివాటం

ఆన్లైన్లోని ఇసుక కోటాను కూడా మాఫియా వదలడం లేదు. ఇసుక అమ్మకాలు పారదర్శకంగా జరిపేందుకు ప్రభుత్వం మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌సాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌, మానిటరింగ్‌ సిస్టం (ఎస్‌ఎస్‌ఎంఎస్‌) పేరుతో కొన్నాళ్ల కింద ఆన్‌లైన్‌ బుకింగ్‌ను అమల్లోకి తెచ్చింది. రోజులో ఒకటి, రెండు గంటలు మాత్రమే ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు చాన్స్​ ఉంటుంది. ఏ టైమ్​కు బుక్‌ చేసుకోవాలో సాధారణ కస్టమర్లకు తెలియదు. కానీ, ఇసుక దందాలో ఉన్న వాళ్లకు మాత్రం ఏ టైమ్లో బుక్​ చేసుకోవాలో ముందే తెలుస్తుంది. ఆన్‌లైన్‌లో ఎంత ఇసుక అందుబాటులో ఉంటే అంత ఇసుకను ఇసుక మాఫియానే బుక్​ చేసుకుంటోంది. సాధారణ కస్టమర్లకు ఎప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసినా స్టాక్‌ ఓవర్‌ అనే చూపిస్తోంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో 1,40,731 మంది కస్టమర్లు ఉన్నట్లు చూపిస్తున్నా .. ఇసుక దళారులే కస్టమర్ల అవతారమెత్తి ఈ కోటాను ఎత్తుకపోతున్నారు. ఇలా బుక్‌ చేసే ఇసుకను వాళ్లు బ్లాక్‌లో అమ్మి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఎంప్లాయీ తన సొంత ఇంటి కోసం ఆన్‌లైన్‌లో ఇసుకను బుక్‌ చేసేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఓ ప్రైవేటువ్యాపారిని సంప్రదిస్తే.. గంటలోనే లారీ లోడు వచ్చి చేరింది.