
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హుజుర్ నగర్ (మం) మాధవగూడెం దగ్గర కారు ఢీకొని టీఆర్ఎస్ కార్యకర్త జగన్ మృతిచెందాడు. 35 ఏళ్ల జగన్.. కేటీఆర్ రోడ్ షోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇవాళ హుజూర్ నగర్ టౌన్ లో రోడ్ షో చేశారు. ఈ రోడ్ షోలో పాల్గొనేందుకు జగన్ వెళ్తుండగా… ఈ ప్రమాదం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్త మృతిపై పార్టీ సంతాపం ప్రకటించింది. కార్యకర్త అయిన జగన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపింది.