మున్సిపల్ ఎన్నికల్లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న కారు

మున్సిపల్ ఎన్నికల్లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న కారు

మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. మరిపెడ, వర్థన్నపేట్, దర్మపురి, డోర్నకల్, కొత్తపల్లి మన్సిపాలిటీలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మన్సిపాలిటీలో మొత్తం 15 వార్డులను క్లీన్ స్వీప్ చేసింది టీఆర్ఎస్. రెండు వార్డులు ఇది వరకే ఏకగ్రీవం కాగా… ఎన్నికలు జరిగిన 13 వార్డులను TRS కైవసం చేసుకుంది.

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట్ మున్సిపాల్టీని TRS కైవసం చేసుకుంది.  మొత్తం 12 వార్డులకు గాను ఎనిమిది వార్డుల్లో టీఆర్ఎస్ గెలిస్తే… 2 వార్డుల్లో కాంగ్రెస్… ఒక వార్డుల్లో బీజేపీ… ఇంకో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాల్టీలో టీఆర్ఎస్ విజయం సాధించింది.  ఫలితాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ హోరాహోరిగా తలపడ్డాయి. మొత్తం 15 వార్డులకు గాను ఎనిమిది వార్డుల్లో టీఆర్ఎస్, ఏడు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచి టఫ్ ఫైట్ ఇచ్చింది.

సంగారెడ్డి జిల్లా జోగుపేట మున్సిపాలిటీని…. టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో  13 టీఆర్ఎస్ గెలుచుకోగా… ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్  అభ్యర్థి గెలుపొందారు. మరోవైపు బొల్లారం మున్సిపాలిటీని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.  మొత్తం 22 స్థానాల్లో టీఆర్ఎస్ 17, బీజేపీ 3, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించింది.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాల్టీని  టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 15 స్థానాల్లో.. టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 1,  ఇండిపెండెండ్లు ముగ్గురు విజయం సాధించారు.

కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 12 వార్డులకు గాను… 11 స్థానాల్లో టీఆర్ఎస్.. ఘన విజయం సాధించింది. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది.

టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్య

15 వార్డుల్లో TRS క్లీన్ స్వీప్ : మరిపెడ మున్సిపాల్టీలో తొలి విజయం

Municipal Elections Results See Here