
మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి TRS పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. 56వేల ఓట్ల మెజిరిటీ తో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పై విజయం సాందించారు. డీకే అరుణ రెండవ స్థానంలో నిలిచారు. మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి ఉన్నారు. ఈ మధ్యే డీకే అరుణ కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరి ఆపార్టీ చుంచే మహబూబ్ నగర్ లోక్ సభ కు పోటీచేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 స్థానాలలో ఇప్పటి వరకు TRS ఐదుస్థానాలలో గెలిచి మరో మూడు స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
TRS.. మన్నె శ్రీనివాస్ రెడ్డి 282255 ఓట్లు సాధించి గెలుపొందారు.
BJP.. డీకే అరుణ 225851 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.
CONGRESS… చల్ల వంశీచంద్‌రెడ్డి 119950 ఓట్లను సాధించి మూడవ స్థానంలో నిలిచారు.