రేపు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్

రేపు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్

హైదరాబాద్: టీఆర్ఎస్ఎల్పీ  మీటింగ్ రేపు ఉదయం 11.30గంటలకు  తెలంగాణ భవన్లో  సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. యాసంగి వడ్ల  కొనుగోలు కోసం  కేంద్రంపై  ఒత్తిడి తేవాలని  నిన్నటి ఫాంహౌస్  మీటింగ్ సీఎం నిర్ణయించారు.  కేంద్రంపై  ఒత్తిడి తెచ్చేలా.. ధర్నాలు,  నిరసన కార్యక్రమాలు  చేపట్టాలన్న సీఎం.. రేపు దీనిపై  రూట్ మ్యాప్  ప్రకటించనున్నారు. 
పంజాబ్ లో  100శాతం  కేంద్రం  ధాన్యం సేకరిస్తుందని... అదే తరహాలో  మన దగ్గర  కూడా 100 శాతం  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ) సేకరించాలని  డిమాండ్ చేస్తూ  ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధాన్యం  కొనుగోళ్ల  మీద కేంద్ర మంత్రులను,  అవసరమైతే ప్రధాని మోడీని కూడా  కలవాలని  డిసైడ్ చేశారు. అటు లోక్ సభ,  రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు  నిరసన తెలుపుతారని సీఎం  కార్యాలయం  వెల్లడించింది. 

 

ఇవి కూడా చదవండి

నాగాలాండ్ అసెంబ్లీ .... మొట్టమొదటి పేపర్లెస్ అసెంబ్లీ

పోలీస్ ఉద్యోగాల ప్రిపరేషన్ కోసం ఫ్రీ కోచింగ్