- విద్యాపాలసీ చైర్మన్ కేశవరావుకు టీఆర్‌టీఎఫ్ వినతి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విద్యా కమి షన్ నివేదికలోని పలు అంశాలు టీచర్లను తీవ్ర అభద్రతాభావానికి గురిచేస్తున్నాయని తెలం గాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) అభిప్రాయపడింది. ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికలో టీచర్ల సర్వీసు నిబంధనలకు తూట్లు పొడిచేలా ఉన్న ప్రపోజల్స్ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది.
సోమవారం హైదరాబాద్ లో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్ డాక్టర్ కేశవరావును టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి కలిసి తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా అందజేశారు.
