
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బిజ్ బెహరా ప్రాంతంలో ఓ ట్రక్ డ్రైవర్ ని కాల్చి చంపారు. అంతకుముందు సొపోర్ లోని బస్టాండ్ లో గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో 19 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి . క్షతగాత్రుల్ని శ్రీనగర్ హాస్పిటల్ కు తరలించారు . యురోపియన్ ఎంపీల బృందం ఇవాళ కశ్మీర్ లోయలో పర్యటించనుంది. వీరి పర్యటనకు ముందే ఉగ్రదాడి జరగడంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి.