కొత్త ఫీచర్లతో ట్రూకాలర్​

కొత్త ఫీచర్లతో ట్రూకాలర్​

హైదరాబాద్​, వెలుగు: ట్రూకాలర్​ యాప్​ కొత్త రూపంలో వచ్చింది. యాప్​లో కొత్త ఫీచర్లను వచ్చాయి. యాప్​స్టోర్లలో స్పష్టంగా గుర్తించగలిగే సరికొత్త యాప్ ఐకాన్‌‌‌‌ను చేర్చింది.ట్రూకాలర్​ వినియోగదారులు ఏఐ ఐడెంటిటీ ఇంజిన్‌‌‌‌లో భాగంగా ‘సెర్చ్​ కాంటాక్ట్స్ ’ అనే శక్తివంతమైన కొత్త యాంటీ- ఫ్రాడ్ ఫీచర్‌‌‌‌ను కూడా పొందుతారు.

 ఏదైనా నంబర్ కోసం చూస్తున్నప్పుడు, ట్రూకాలర్ వినియోగదారులకు ఆ నంబర్ పేరు ఇటీవల మారినా లేదా తరచుగా మారుతున్నా తెలుసుకోవచ్చు. పసుపు రంగులో నంబర్​ కనిపిస్తే అది అనుమానాస్పద నంబర్​గా భావించాలి. మోసపూరిత, స్కామర్​ కార్యకలాపాలకు పాల్పడుతున్న నంబర్లు అయితే ఎరుపు రంగులో కనిపిస్తాయి.