చార్లీని చరిత్ర మర్చిపోదు.. అతనో ఫ్రీడమ్ మార్టర్: ట్రంప్

చార్లీని చరిత్ర మర్చిపోదు.. అతనో ఫ్రీడమ్ మార్టర్: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌ ఇటీవల హత్యకు గురైన తన ఫ్రెండ్, కన్జర్వేటివ్‌‌ యాక్టివిస్ట్‌‌ చార్లీ కిర్క్‌‌ సంతాప సభకు అటెండ్ అయ్యారు. ఆదివారం అరిజోనా గ్లెండేల్‌‌లోని స్టేట్ ఫార్మ్ స్టేడియంలో నిర్వహించిన ఈ సంతాప సభకు చార్లీ కిర్క్‌‌ భార్య ఎరికా కిర్క్‎తో సహా దాదాపు 65 వేల మంది హాజరయ్యారు. అయితే, సంతాప కార్యక్రమంలో ప్లే చేసిన 'అమెరికా ది బ్యూటిఫుల్' పాటకు ట్రంప్ డ్యాన్స్ చేసి సభను ఉత్సాహపరచగా.. ఎరికా కిర్క్ ఆయన పక్కనే నిలబడి కన్నీటితో నవ్వుతూ కనిపించారు.

మెమోరియల్ సర్వీస్‌‌లో మొత్తం 45 నిమిషాలు మాట్లాడిన ట్రంప్.. చార్లీ కిర్క్‌‌ను అమెరికన్ ఫ్రీడమ్ మార్టర్‎గా అభివర్ణించారు. "చార్లీ మన జనరేషన్‌‌లో గ్రేట్ మ్యాన్. అతను టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థను మల్టీమిలియన్ ఆర్గనైజేషన్‌‌గా మార్చాడు. చార్లీని చరిత్ర మర్చిపోదు. చార్లీ కిర్క్‌‌ భార్య ఎరికా వెరీ స్మార్ట్, స్ట్రాంగ్ ఉమెన్. 

చార్లీ సేవలకుగాను అత్యున్నత సివిలియన్ గౌరవమైన పోస్ట్‌‌హ్యూమస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ మెడల్‌‌ను అతని భార్య ఎరికాకు ఇవ్వాలని నిర్ణయించాం" అని వివరించారు. అనంతరం ఎరికా కిర్క్ భావోద్వేగ ప్రసంగం చేశారు."యూటా ఆస్పత్రిలో నా భర్త శవాన్ని చూసి షాక్ అయ్యా. ఎంతో బాధను అనుభవించాను. కానీ మరణంలో కూడా అతని చిరునవ్వును చూశాను. అది దేవుని కరుణ. చార్లీని చంపిన నిందితుడిని నేను క్షమిస్తున్నాను. చార్లీ, నిన్ను ప్రౌడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ అమెరికా" అని పేర్కొన్నారు.