డబ్ల్యూహెచ్ఓ కు పైసలియ్యం

డబ్ల్యూహెచ్ఓ కు పైసలియ్యం

చైనాకు అనుకూలంగా వ్యవహారిస్తుందంటూ ట్రంప్ ఆగ్రహం

వాషింగ్టన్ : వరల్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహారిస్తుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా నుంచి ఇవ్వాల్సిన నిధులను పూర్తిగా నిలిపివేస్తామని…ఇది మాటలకే పరిమితం కాదు చేసి చూపుతామన్నారు. అమెరికాలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. మొత్తం అమెరికా అధికారులంతా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే కష్టపడుతున్న కంట్రోల్ లోకి రావటం లేదు. దీంతో ట్రంప్ అసహనంగా ఉన్నారు. కరోనా వైరస్ ప్రారంభమయ్యే నాటికే చైనా వద్ద సమాచారం ఉన్నప్పటికీ ఇతర దేశాలను అలర్ట్ చేయలేదని…ఈ విషయంలో (డబ్ల్యూహెచ్ఓ) కూడా విఫలమైందన్నారు. కరోనా ప్రబలే సమయంలో చైనాకు తాము ప్రయాణాలను ఆపిస్తే డబ్లూహెచ్ఓ వ్యతిరేకించదని ట్రంప్ గుర్తుచేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ‘‘ డబ్ల్యూహెచ్‌ఓకు ఇచ్చే డబ్బును ఆపేస్తాం. నేను చెప్పింది చేస్తాను. పూర్తిగా ఫండింగ్ కూడా ఆపేయాలని భావిస్తున్నాం. అమెరికాకే నా తొలి ప్రాధాన్యం ” అని ఆయన చెప్పారు. కరోనాను కట్టడి చేయటంలో చైనా గొప్పగా వ్యవహారించిందంటూ డబ్య్లూహెచ్ ఓ ప్రెసిడెంట్ ప్రశంసించటాన్ని కూడా ట్రంప్ ఇదివరకే విమర్శించారు. యూఎన్ అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూహెచ్ఓ కు సగానికి పైగా ఫండ్స్ అమెరికానే సమాకురుస్తుంది. అలాంటిది ఆ సంస్థ చైనాకు అనుకూలంగా పనిచేస్తుందంటూ ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.