ఉద్యోగాలు లేకపోవడంతో యువత గ‌న్‌‌లు పట్టుకుంటోంది

ఉద్యోగాలు లేకపోవడంతో యువత గ‌న్‌‌లు పట్టుకుంటోంది

శ్రీనగర్: బీజేపీ సర్కార్‌‌పై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విమర్శలకు దిగారు. జమ్మూ కశ్మీర్‌‌లో ఉద్యోగాలు లేకపోవడంతో యువత గన్లు పట్టుకుంటోందని మెహబూబా అన్నారు. ‘జమ్మూ కశ్మీర్‌‌ను ఇక్కడి వనరులను బీజేపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. పంటిట్‌‌ల పరిస్థితేంటి? పంటిట్లకు బీజేపీ పెద్ద పెద్ద వాగ్దానాలు చేసింది. బయటివాళ్లను ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు లేవు. చేతికి గన్లు అందుకోవడం మినహా వారికి మరో మార్గం కనిపించడం లేదు. టెర్రర్ రిక్రూట్‌‌మెంట్స్ పెరిగాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు జమ్మూ కశ్మీర్‌‌లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఆర్టికల్ 370 అనేది ముస్లింలు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది జమ్మూ కశ్మీర్ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు సంబంధించిన విషయం. ఇక్కడి ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు’ అని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు.