భారత్ కు సారీ చెప్పండి..ట్రంప్‌‌‌‌కు యూఎస్ ఎక్స్‌‌‌‌పర్ట్ హితవు

భారత్ కు సారీ చెప్పండి..ట్రంప్‌‌‌‌కు యూఎస్ ఎక్స్‌‌‌‌పర్ట్ హితవు

వాషింగ్టన్: భారత్‌‌‌‌ దిగుమతులపై అమెరికా 50% టారిఫ్‌‌‌‌లు విధించడాన్ని ఆ దేశ ఆర్థికరంగ నిపుణుడు, ప్రొఫెసర్​ ఎడ్వర్డ్​ ప్రైస్​ తప్పుబట్టారు. వెంటనే సుంకాలను ఎత్తివేసి భారత్​కు క్షమాపణ చెప్పాలని అమెరికా ప్రెసిడెంట్ ​ట్రంప్‌‌‌‌కు హితవు పలికారు. ఏఎన్‌‌‌‌ఐతో ఎడ్వర్డ్ మాట్లాడుతూ.. రష్యా, చైనాతో భారత ప్రధాని మోదీ సంబంధాలను నిర్వహించడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. 

‘‘భారత్‌‌‌‌- అమెరికా భాగస్వామ్యాన్ని నేను 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నాను. ఇది చైనా, రష్యాల మధ్య ఏం జరుగుతుందో నిర్ణయిస్తుంది. 21వ శతాబ్దంలో భారత్‌‌‌‌  నిర్ణయాత్మక ఓటు కలిగి ఉంది.  చైనాతో ఘర్షణలో, రష్యాతో యుద్ధంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌‌‌‌పై 50 శాతం సుంకాలు ఎందుకు విధించారో నాకు అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానించారు.