చైనాతో యుద్ధం జరగొచ్చు

చైనాతో యుద్ధం జరగొచ్చు

తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న సమయంలో.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు చైనాతో..అమెరికా దేశం యుద్ధం చేసేలా ఉందని అన్నారు. అమెరికాలోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏమాత్రం గౌరవించడం లేదని అన్నారు. త్వరలో చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నారన్నారు.

 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మరోసారి ట్రంప్‌ ఆరోపించారు. అవినీతి ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందని విమర్శించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో బైడెన్‌ ప్రభుత్వం అనుసరించిన తీరును కూడా ట్రంప్‌ తప్పుపట్టారు.