మీ అంతం భయంకరంగా ఉంటది: హమాస్‎కు ట్రంప్ వార్నింగ్

మీ అంతం భయంకరంగా ఉంటది: హమాస్‎కు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: హమాస్‎కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రియాక్షన్ భయంకరంగా ఉంటుందని హెచ్చరించాడు. హమాస్ సీజ్ ఫైర్ నిబంధనలను ఉల్లంఘిస్తే వాళ్లను అంతం చేసేందుకు అనేక మధ్యప్రాచ్య దేశాలు గాజాలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయని బెదిరించాడు. మరోసారి సీజ్ ఫైర్ నిబంధనలు బ్రేక్ చేస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హమాస్‎ను అంతం చేస్తామని.. హమాస్ పతనం చాలా క్రూరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే.. హమాస్ అలాంటి పని చేయదని తాను అనుకుంటున్నానని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా, గత రెండేళ్లుగా నిర్విరామంగా సాగుతోన్న హమాస్, ఇజ్రాయెల్ యుద్ధానికి ట్రంప్ ఇటీవల ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారు. అయితే.. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిందని ఆరోపిస్తూ శనివారం గాజాలో తిరిగి వైమానిక దాడులను ప్రారంభించింది ఇజ్రాయెల్. 

రఫాలోని ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని.. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనికి కౌంటర్‎గా ఇజ్రాయెల్ గాజాలో వైమానిక దాడులు చేయగా.. దాదాపు 44 మంది మరణించినట్లు సమాచారం. అయితే కాల్పులు విరమణ ఒప్పందం ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ చేస్తోన్న ఆరోపణలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అమెరికాను కోరింది. ఈ క్రమంలో హమాస్‎కు ట్రంప్ ఘాటు హెచ్చరికలు పంపడం గమనార్హం. 

►ALSO READ | ఇండియా పాత్ర లేదు.. పాక్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు: దాయాది దేశ పరువు తీసిన ఆప్ఘాన్ మంత్రి