సిమ్ కార్డుల జారీలో గైడ్​లైన్స్ పాటించాలి

సిమ్ కార్డుల జారీలో గైడ్​లైన్స్ పాటించాలి
  •     టీఎస్‌‌‌‌‌‌‌‌ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌‌‌‌‌ 
  •     టెలికమ్‌‌‌‌‌‌‌‌,ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్లతో భేటీ

హైదరాబాద్,వెలుగు :  సిమ్‌‌‌‌‌‌‌‌ కార్డుల అక్రమ వాడకం, మోసాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని వినియోగించాలని టీఎస్‌‌‌‌‌‌‌‌ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌బీ)  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌‌‌‌‌  సూచించారు.  సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరోకు సహకరించాలని కోరారు. టీఎస్‌‌‌‌‌‌‌‌సీఎస్‌‌‌‌‌‌‌‌బీ, టెలికమ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్స్‌‌‌‌‌‌‌‌తో మంగళవారం భేటీ అయ్యారు.  బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌, జియో, వీఐ, బీఎస్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు అత్రియ టెలీకమ్యూనికేషన్స్‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌, జియో ఫైబర్‌‌‌‌‌‌‌‌ తదితర సంస్థల ప్రతినిధులు, టెలికమ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా(ట్రాయ్‌‌‌‌‌‌‌‌),టెలికమ్‌‌‌‌‌‌‌‌ విభాగానికి చెందిన సీనియర్‌‌‌‌‌‌‌‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సిమ్‌‌‌‌‌‌‌‌కార్డుల జారీకి కొత్త గైడ్ లైన్స్  గురించి తెలుసుకున్నారు. సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాల నియంత్రణకు టీఎస్‌‌‌‌‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యురిటీ బ్యూరో తీసుకునే  చర్యలను వివరించారు. కార్యక్రమంలో సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు విశ్వజిత్‌‌‌‌‌‌‌‌ కంపాటి,ఎం దేవేందర్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌, రాచకొండ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్ల సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం పోలీస్‌‌‌‌‌‌‌‌ అధికారులు పాల్గొన్నారు.