టీఎస్ ఎంసెట్ యథాతథం

టీఎస్ ఎంసెట్ యథాతథం

హైదరాబాద్గు :  టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్‌‌ ఎగ్జామ్స్ సోమవారం నుంచి యథాతథంగా జరుగుతాయని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పారు. మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటలకు.. మధ్యాహ్నం సెషన్ 3 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. 

తెలంగాణలో 89, ఏపీలో19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, దాదాపు 1,72,241 మంది ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. ఒక్కో సెషన్‌‌కు 29 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. హాల్‌‌ టికెట్లలో అన్ని సూచనలు జారీ చేశామని, వాటిని తప్పక అనుసరించాలని ఎంసెట్ కన్వీనర్ కోరారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ వాయిదా పడటంతో.. ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉంటుందో  లేదోనన్న గందర గోళానికి తాజాగా తెరపడింది.