ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ లో మార్పులు

ఎంసెట్ కౌన్సెలింగ్  షెడ్యూల్‌ లో మార్పులు

వెలుగు కథనానికి స్పందన 

హైదరాబాద్, వెలుగు : ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ గడువును పెంచినట్ల టెక్నికల్ ఎడుయ్కేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ‘బీటెక్ చదువులకు.. ఇంటర్ సప్లిమెంటరీ తిప్పలు’ శీర్షికతో మంగళవారం ‘వెలుగు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి షెడ్యూల్‌ లో మార్పులు చేశారు. రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు స్లాట్ బుకింగ్ గడువు సోమవారంలో ముగియగా, దాన్ని గురువారం వరకు పెంచారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సెప్టెంబర్ 2 వరకు పొడిగించినట్టు చెప్పారు. వెబ్ అప్షన్ల గడువు 3వ తేదీ వరకు ఉందని సూచించారు. ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలతో సంబంధం లేకుండా గతంలో ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. దీని వల్ల ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చిన స్టూడెంట్లకు పేరున్న కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశం తక్కువ అనే అంశాన్ని ‘వెలుగు’కథనంలో ఎత్తిచూపింది. అలాగే స్టూడెంట్లు, పేరెంట్స్ నుంచి గడువు పెంచాలని విజ్ఞప్తులు రావడంతో స్లాట్ బుకింగ్ కు మూడ్రోజులు గడువు పొడిగించారు.