
నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. ఉన్నత విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో లెక్చరర్ 491, లైబ్రేరియన్ 24, ఫిజికల్ డైరెక్టర్ 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ లెక్చరర్ పోస్టులలో అత్యధిక ఖాళీలు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ విభాగంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ త్వరలోనే విడుదల చేయనుంది.